ASR: అరకు ట్రైబల్ మ్యూజియంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కార్మికుల సంఘం ప్రెసిడెంట్ రాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం పలువురు ఉద్యోగులు, కార్మికులతో కలిసి రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సంవత్సరాల తరబడి చాలీచాలని వేతనాలతో మ్యూజియం వద్ద పనిచేస్తున్నామన్నారు. తమకు వేతనాలు పెంచాలని కోరారు.