VZM: తమిళనాడు రామేశ్వరంలో రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనం కోసం బయలుదేరిన భక్తులు మృత్యువుకు గురవడం మనసును కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపి, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని తమిళనాడు అధికారులతో చర్చించారు.