ELR: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో సీట్ల భర్తీకి గురువారం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు నూజివీడు క్యాంపస్లో, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు ఇడుపులపాయలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామరని పేర్కొన్నారు.