KRNL: ఆస్పరి మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 29న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గీతా వాణి తెలిపారు. సమావేశంలో రెవెన్యూ, వ్యవసాయ, విద్య, విద్యుత్, వైద్యం, ఉపాధి హామీ పథకం, మంచినీటి సమస్య, వెలుగు, ఐపీడీఎస్ శాఖల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు.