GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బోటనీ విభాగ ఆచార్యులు కొక్కంటి మల్లికార్జునకు ఉత్తమ అకాడమిక్ లీడర్ అవార్డు లభించింది. బీహార్ కేంద్రంగా ఉన్న 360 రీసెర్చ్ ఫౌండేషన్ జాతీయ స్థాయి సంస్థ అందించే ఉత్తమ అకాడమిక్ లీడర్ అవార్డు, నేషనల్ సృజన్ అవార్డు 2025కు ఆయన ఎంపికయ్యారు. వర్సిటీ అధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు గురువారం అభినందించారు.