VZM : దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో స్థానిక ఎత్తు బ్రిడ్జ్, సంతకాల వంతెన వద్ద ఉన్న రాజీవుగాంధీ విగ్రహానికి నాయకులంతా పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.