SKLM: ఇచ్చాపురం రూరల్ పోలీసు స్టేషను పరిధిలో ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్, దుకాణాలు, షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా జరిగే ప్రదేశాలలో డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా, నిల్వలను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.