SKLM: కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజలకు సంక్షేమం అందించడమేనని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. బుధవారం కవిటి మండలం బి. గొనప పుట్టుగ పంచాయతీ పరిధిలోని పర్రి పుట్టుగ గ్రామంలో ”సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధికి సంక్షేమ పథకాలు కీలకమన్నారు.