పల్నాడు: జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు నిర్వహించిన పల్నాడు బాలవోత్సవాలలో చిన్నారుల రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 60కి పైగా విభాగాలలో పోటీలు నిర్వహించారు. రంగవల్లులు సంబంధించి 500ల మందికిపైగా చిన్నారులు తమ ప్రతిభ ప్రదర్శించారు. ఉత్తమ రంగవల్లులకు బహుమతి ప్రధానంతో పాటు పాల్గొన్న చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులను కమిటీ సభ్యులు అందించారు.