అన్నమయ్య: ములకలచెరువు మండల సాధారణ సర్వసభ్య సమావేశం జనవరి 2వ తేదీన స్థానిక MPDO కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు MPDO హరినారాయణ తెలిపారు. మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను సిద్ధం చేసుకుని రావాలన్నారు.