ATP: రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం మురది గ్రామంలో వెలసిన ప్రసిద్ద మురడి ఆంజనేయుడికి కార్తీకమాసం శనివారం ప్రత్యేక పూజలు చేపట్టారు. పురోహితుడు పవన్ కుమార్ విశేష పూజలు చేపట్టి స్వామి మూల విరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.