W.G: విద్యార్థులు సమాజ సేవలో పాల్గొని తద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మిసుందరిబాయ్ పేర్కొన్నారు. జాతీయ సేవాపథం (ఎస్ఎస్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రత, అక్షరాస్యత ఎన్ఎస్ఎస్ లక్ష్యమని అన్నారు.