ప్రకాశం: వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్‌ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు. కొండపి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.