W.G: నేరాలను తగ్గించడంలో సర్కిల్ పరిధిలో సిబ్బంది ఒకరితో ఒకరు మమేకమై కలిసి పని చేయాలని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ అన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషను డీఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ మహిళ సంరక్షక కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.