NDL: మహానంది మండలం గోపవరం గ్రామంలో ఎస్సీ కాలనీలో గుర్రం మల్లికార్జున ఇంటి ముందు ఉంచిన మోటార్‌సైకిల్‌కు శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలిన వాసన రావడంతో బయటికి వచ్చి చూసేసరికి బైక్ మంటల్లో కనిపించిందని బాధితుడు తెలిపారు. గ్రామంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో పోలీసుల విచారణ కొనసాగుతోంది.