కోనసీమ: సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ ముమ్మిడివరం బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం గురువారం మూడో రోజుకి చేరుకుంది. కేంద్రం ప్రభుత్వం దాడిచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఇలాంటివి పునరావృత కాకుండా తగిన కఠిన చట్టాలు చేయాలన్నారు.