KDP: బ్రహ్మంగారి మఠం మండలం జౌకుపల్లి గ్రామంలో కుక్కల దాడిలో 34 మేక పిల్లలు మృతి చెందిన సంఘటన జరిగింది. వీధి కుక్కల గుంపు మేకల మందపై దాడి చేసి చంపినట్టు బాధితుడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మేకల విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని స్థానికులు తెలిపారు. కుక్కల దాడిలో తీవ్రంగా నష్టపోయిన తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేకల కాపరి కోరారు.