ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ చీమకుర్తి మండలంలోని మండల స్టాక్ పాయింట్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. మార్చి అలాట్‌మెంట్‌కు సంబంధించిన నిత్యావసర సరుకుల స్టాక్ వివరములను పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరల దుకాణాలకు రవాణా అవుతున్న సోర్టెక్స్, ఫోర్టిఫైడి బియ్యం, పంచదార స్టాక్ వివరాలను తనిఖీ చేశారు.