పల్నాడు: మహా శివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండ తిరునాళ్లకు వినుకొండ ఆర్టీసీ డీపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డీపో మేనేజర్ జవ్వాజి నాగేశ్వరరావు తెలిపారు. వినుకొండ డీపో నుంచి కోటప్పకొండకు సుమారు 45పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.