ప్రకాశం: రాచర్లలో సోమవారం ఆరోగ్య శాఖ సిబ్బంది సామాజిక కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అంగవైకల్యం కలిగిన పిల్లలు, బడి బయట ఉన్న పిల్లలను, బాల్య వివాహాలు జరిగిన పిల్లలను గుర్తించడంలో సమగ్ర సర్వే నిర్వహించారు. అడ్వకేట్ రవి ప్రకాశ్ బాబు మాట్లాడుతూ.. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే 1098కు ఫోన్ చేసి తెలపాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతారని అన్నారు.