KDP: సిద్దవటం మండలంలోని కొత్త మాధవరం గ్రామ సమీపాన వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు సుబ్బరాయుడు స్వామివారికి జలాభిషేకం, ఆకు పూజ వంటి పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.