అన్నమయ్య: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం తిమ్మిశెట్టిపల్లి అరుంధతి వాడలో ప్రారంభమైంది. మాజీ MLA కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజా హామీలు అమలు చేయకుండా కమిషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, దీని వ్యతిరేకంగా 45 రోజులపాటు సంతకాల సేకరణ జరుగుతుందని తెలిపారు.