ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా నుంచి సేకరించిన 4,55,840 సంతకాల ప్రతులను తాడేపల్లికి తరలించారు.