కర్నూలు పట్టణంలోని డీసీఆర్బీని జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ తనిఖీ చేశారు. ఈ మేరకు అన్ని విభాగాలకు చెందిన రికార్డులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా నమోదు అయ్యే కేసుల వివరాల గురించి డీసీఆర్బీ సీఐని అడిగి తెలుసుకున్నారు. రౌడీలు, అనుమానితుల రిజిస్టర్లు, పలు రికార్డులు, వార్షిక పనితీరు నివేదికల గురించి అడిగి తెలుసుకున్నారు.