NTR: కృష్ణా తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. అమరావతిలో జాతీయ జల క్రీడలు, బ్యాడ్మింటన్ శిక్షణ హబ్‌ల ఏర్పాటుకు సహకరించాలని ఎంపీ బృందంతో కలిసి సీఎం కోరారు. అటు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.