VZM: పోలీసుశాఖ ఆధ్వర్యంలో దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరై బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడన్నారు.