అన్నమయ్య: రాజంపేట మండలం ఊటుకూరులో పుల్లంగేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి ఈ ఏరియాలో వర్షం పడింది. గురువారం తెల్లవారుజామున 5గంటల తర్వాత ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఊటుకూరు – కొండ్లోపల్లి మధ్య రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు ఎవరూ వాగు దాటే ప్రయత్నం చేయవద్దని MRO హెచ్చరికలు చేశారు.