TPT: నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపళ్లికొండేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రదోష పూజలు జరుగుతాయని ఈఓ లతా తెలిపారు. ఈ మేరకు అభిషేక పూజలకు కావలసిన పూజా సామగ్రిని భక్తులు విరాళంగా అందించవచ్చున్నారు. కాగా, భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని ఆమె కోరారు.