చిత్తూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా పుంగనూరు మండలం, సుగాలి మిట్టకు చెందిన బాణావత్ మునీంద్ర నాయక్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మునీంద్ర నాయక్ ఆదివారం మాట్లాడుతూ.. ఈ ఉత్తర్వులను తనకు శనివారం సాయంత్రం అందజేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు అందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానన్నారు.