కడప: గండికోట ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమైన పైడిపాలెం రిజర్వాయర్లో సోమవారం 4.91 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. రిజర్వాయర్లో నీటిమట్టం 276.81 మీటర్ల వద్దకు చేరింది. రిజర్వాయర్లోకి ఇన్ ఫ్లో ఏమి లేదని,10 క్యూసెక్కుల నీరు బయటికి వదులుతున్నట్లు వెల్లడించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి కెపాసిటీ 6 టీఎంసీలు అని అధికారులు పేర్కొన్నారు.