VSP: తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు. విశాఖలో మాట్లాడుతూ.. నెయ్యిని పరీక్షించే లోపే లడ్డు విక్రయాలు జరిగిపోయాయని తెలిపారు. కల్తీ జరిగింది మాత్రం వాస్తవం అని ఆయన స్పష్టం చేశారు. సిట్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.