BPT: నగరం మండలంలో తొలగించిన వీఓఏలను వెంటనే వీదుల్లోకి తీసుకోవాలని జై భీమ్రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య తెలిపారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాపట్ల కలెక్టర్‌కి హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాపీలను ఇచ్చారు. అధికారంలోకి వస్తే కాలపరిమితి సర్కులర్ ను రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశారు.