ASR: తజంగి గ్రామంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి రూ.6.75 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. మొత్తం రూ.35 కోట్లతో మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.15 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.20 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్లో రూ.6.75 కోట్లు విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.