NLR: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ గౌరవ అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్మికులకు చాలీచాలని జీతాలతో పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ ద్వారా కార్మికులకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదన్నారు.