GNTR: రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం మాచర్ల నుంచి గుంటూరుకు నూతనంగా 7 బస్సు సర్వీసులను ఏర్పాటు చేయటం హర్షణీయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. నేడు మాచర్ల డిపోలో నూతన బస్సు సర్వీసులను ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.