PLD: వినుకొండ మండలం అందుగల కొత్తపాలెం, నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి మధ్య గుండ్లకమ్మ నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు పాల్గొన్నారు.