TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ముంబైలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరుకానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ముంబయికి వెళ్లనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫెస్టోపై సలహాలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో అగ్రనేతలతోపాటు ఏఐసీసీ పెద్దలు కూడా పాల్గొననున్నారు.