ELR: ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా పథకంపై జిల్లాలోని గ్యాస్ డీలర్లు, అయిల్ కంపెనీ యాజమాన్యాలు, పౌర సరఫరా అధికారులతో శుక్రవారం స్థానిక గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 6,31,044 మంది బియ్యం కార్డుదారులలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుటకు అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు.