AP: రాష్ట్రంలో అక్రమ రెడ్ గ్రావెల్ తవ్వకాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా 20.95 ఎకరాల్లో అక్రమంగా రెడ్ గ్రావెల్ తవ్వకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ జగన్నాథపురంలో పర్యటించినప్పుడు ఈ అక్రమాల గురించి తన దృష్టికి రావడంతో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులపై, అనుమతులు ఇచ్చినవారికి నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.