చిత్తూరు: జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 11న సోమవారం మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అంతా పాల్గొని పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.