టూ వీలర్‌పై రోడ్డు మీదకి వస్తే హెల్మెట్ కచ్చితంగా ధరించాలనిహైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. వారాంతాల్లో పబ్‌లు, రెస్టారెంట్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, జనాలు డైన్, వైన్‌పై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కానీ జాగ్రత్తలు తీసుకోవట్లేదన్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు 48,550 కేసులు బుక్ చేశామమన్నారు. వీటిలో 42 వేల కేసులు ద్విచక్ర వాహనాలవేనని తెలిపారు.