డిపాజిట్లపై వడ్డీ రేట్లు, కస్టమర్ సర్వీస్‌పై నిర్దిష్ట ఆదేశాలు పాటించని కారణంగా సౌత్ ఇండియన్ బ్యాంక్‌పై రూ.59.20లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక స్థితికి సంబంధించి ఆదేశాలు, నిబంధనలను పాటించకపోవడంపై సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు నోటీసులు పంపింది. కొందరు కస్టమర్లకు ఎస్ఎంఎస్ లేదా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు వసూలు చేసిందని ఆర్బీఐ తెలిపింది.