KKD: పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అజెండాలోని 30 అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు సమావేశానికి సకాలంలో హాజరుకావాలని ఆమె కోరారు.