KKD: కాకినాడలో రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీలను జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పోటీలు జరుగుతాయి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 మంది బాలబాలికలు, 100 మంది క్రీడా అధికారులు, కోచ్, మేనేజర్లు, కమిటీ సభ్యులు, సాంకేతిక సిబ్బంది హాజరుకానున్నట్లు తెలిపారు.