GNTR: తాడేపల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద వామపక్షాలు, సీఐటీయూ, వైసీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ.. సిమెంట్ కంపెనీ కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.