VZM: జీడిపంటకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని ఉద్యానశాఖాధికారి జ్యోత్స్న వెల్లడించారు. నెల్లిమర్ల మండలం టెక్కలిలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జీడి సాగు రైతులు ఎకరానికి రూ.1500 చొప్పున ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలని సూచించారు. రైతులు ఒన్ బి, ఆధార్, బ్యాంకు అకౌంట్ తో 15 తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.