NDL: గుంతల రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. మహానంది వ్యవసాయ కళాశాల నుంచి మహానంది క్షేత్రానికి వెళ్లే రహదారి గుంతలతో రోడ్డు అధ్వానంగా తయారైంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంతలలో నీరు నిలబడి నీటి కుంటలను తలపిస్తున్నాయి. ప్రతినిత్యం ఈ రహదారిలో వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు.