గుంటూరుజిల్లా విద్యాశాఖ అధికారిగా రేణుకా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా జిల్లా విద్యాశాఖ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా గుంటూరు డీఈవోగా రేణుకను నియమించారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రస్తుతం రేణుక పని చేస్తున్నారు. త్వరలో డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత డీఈవో శైలజకు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు.