ప్రకాశం: అద్దంకి MLA రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి.రవికుమార్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో C.M చంద్రబాబు అధ్యక్షతన జరిగే క్యాబినెట్ మీటింగ్‌కి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించామని తెలియజేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా పంట నష్టం గురించి చర్చించడం జరిగిందని తెలిపారు.