కృష్ణ: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ట్వీట్ చేసింది. సముద్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వాయుగుండం రేపు తెల్లవారు జామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.